Disclaimer The songs here are for promotional purpose only. Making CD's from mp3 video etc files is illegal. Buy original cd's from the nearest store. We neither upload nor host any of these files. We found all the links by mining the net. These are provided to give users the idea of best music. All the rights are reserved to the audio video company. Blog owners hold no responsibility for any illegal usage of the content. Any disclaimer can contact idleshare2008@gmail.com
Your Ad Here

Wednesday, September 24, 2008

Raksha



Story Akella Vamsikrishna
Screenplay Akella Vamsikrishna
Direction Akella Vamsikrishna
Camera S D Ghosh
Editing Bhanodaya
Music Bappi Tutul
Dialogs Jeevan Reddy
Presenter Ramgopal Varma
Producer Azam Khan
Banner Onemore Touch Entertainments
Release Sep-19-2008
Reviewed on Sep-24-2008
*ing: Baby Neha, Subbaraju, Rajeev Kanakala, Jagapati Babu, Kalyani


రక్ష అన్న మాటకు అర్ధాలు చాలా వుంటాయి. అయితే చాలా గ్రామాల్లో రక్ష అంటే తాయెత్తు అనే అర్ధమే వస్తుంది. ఆకెళ్ళ వంశీ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ రక్ష చిత్రం కూడా అటువంటి వాటికి సంబందించినదే. ఇటీవలే రిలీజ్ అయిన ఫూంక్ చిత్రానికి ఇది తెలుగు నకలు అనే చెప్పాలి. యండమూరి తులసీదళం ఆధారం గా రూపొందిన ఈ చిత్రం చూస్తుంటే పెద్ద థ్రిల్ గా అయితే అనిపించలేదు. అయితే దానికి ముఖ్య కారణం ఫూంక్ చిత్రం చూసి ఎక్కువ కాలం కాకపోవడమే. సరే ఫూంక్ ని కాసేపు పక్కన పెట్టి రక్ష కధ ఏంటీ అని చూస్తే . . .

రాజీవ్ (జగపతి బాబు), ఆర్తి (కళ్యాణి) లది హ్యాపీ ఫ్యామిలీ. వీరికి రక్ష (నేహ) రాహుల్ (అతులిత్) అనే ఇద్దరు పిల్లలు. రాజీవ్ పూర్తి స్థాయి నాస్తికుడైతే అతని తల్లి (రాధాకుమారి) ఆర్తి లు పరమ ఆస్తికులు. కూతురు రక్ష పేరుమీద రాజీవ్ ఒక కనష్ట్రక్షన్ కంపెనీ నడుపుతూ వుంటాడు. అతను చేస్తున్న ఒక వెంచర్ దగ్గర వినాయకుడి షేప్ లో వున్న ఒక రాయి బయటపడుతుంది. అక్కడ పనిచేసేవారందరూ ఆ ప్లేస్ లో వినాయకుడి కి ఒక గుడి కట్టాలని డిమాండ్ చేస్తారు. అవసరమైతే పనివాళ్ళనన్నా మారుస్తాను గానీ అలాంటివి తాను చేయనని రాజీవ్ అంటాడు. రాజీవ్ కి అన్ని రకాలు గా సహాయపడే వేణు (రాజీవ్ కనకాల) మధు (సత్యకృష్ణన్) లు ఈ వెంచర్ విషయం లో తనను చాలా మోసం చేసారు అన్న విషయాన్ని తన స్నేహితుడు వినయ్ (సుబ్బరాజు) ద్వారా తెలుసుకొన్న రాజీవ్ వాళ్ళిద్దరినీ బయటకు గెంటివేస్తాడు. అప్పటినుండీ రాజీవ్ ఇంటిలో విపరీత పరిణామాలు సంభవిస్తూ వుంటాయి. రాజీవ్ ప్రాణప్రదం గా చూసుకొనే రక్ష ప్రవర్తన విపరీతం గా వుంటుంది. మగవాడి గొంతుకతో మాట్లాడడం, గాలిలో తేలడం వంటి వి చేస్తున్న రక్షను చూసి ఇంటిల్లిపాదీ తల్లడిల్లిపోతూ వుంటారు. రాజీవ్ తల్లి ఇదంతా చేతబడి వల్లనే జరుగుతుందని ఎంతచెప్పినా వినని రాజీవ్ డాక్టర్లను కలుస్తాడు. అయినా ప్రయోజనం వుండదు. అసలు ఇలాంటి పరిణామాలు ఎందుకు సంభవించాయి. వినయాకుడి గుడి కట్టకపోవడం వల్లనా, రక్ష మానసిక పరిస్తితి బాగోకపోవడం వల్లనా లేక నిజంగానే ఆమెకు చేతబడి జరిగిందా?? ఒకవేళ అది నిజంగానే అది చేతబడి వల్లనే జరిగితే మరి నాస్తికుడైన రాజీవ్ దానిని ఎలా నమ్మాడు... వీటన్నిటి మద్యలో అభం శుభం ఎరుగని రక్ష ఎన్ని ఇబ్బందులను అనుభవించింది వంటి విషయాలను తెరమీద చూస్తేనే బాగుంటుంది.

ఒక స్టీరియో టైపు పాత్రల పోషణకు అలవాటు పడిపోయిన జగపతి బాబు కు ఈ చిత్రం నిజంగా నటించడానికి మంచి స్కోప్ ను ఇచ్చింది. కూతురు ఏమైపోతుందో అని తల్లడిల్లే తండ్రిగా నమ్మకానికి, వాస్తవానికి మద్య ఒక రకమైన అయొమయానికి గురయ్యే ఒక వ్యక్తిగా ఆయన నటన ఈ చిత్రం లో ఆకట్టుకొనే రీతిలో వుంది. ఇక ఆర్తి పాత్రలో కళ్యాణి ది అంత పెద్ద ప్రాధాన్యత వున్న పాత్రేం కాదు. రాధాకుమారి, సుబ్బరాజు, జీవా, రాజీవ్ కనకాల ల పాత్రలు కూడా అంత గా ప్రాధాన్యత వున్న పాత్రలు కావు. వారి వారి పాత్రల పరిధి మేరకు వారందరూ బాగానే చేసారు. ఈ చిత్రం లో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది చిన్ని పాప నేహ గురించే. రక్ష గా ఆ అమ్మాయి నటన చాలా బావుంది. అలాగే ఆమె తమ్ముడి గా అతులిత్ నటన కూడా ఆకట్టుకొంటుంది. మంత్రగాడుగా ప్రదీప్ రావత్ బాగానే చేసాడు. ఫేమస్ సైకయాట్రిస్ట్ గా జయసుధ రోల్ కనబడేది కొంచం సేపే అయినా బావుంది. మధు గా సత్య కృష్ణన్ పాత్ర ఆకట్టుకొంటుంది.

ఇక సాంకేతికం గా చూసుకొంటే కధ ఎలాగూ ఎత్తేసిన కధే కాబట్టి దానిని పక్కన పెడితే ఈ చిత్రానికి ఆకెళ్ళ వంశీ సమకూర్చిన కధనం చాలా బావుంది. ఇటువంటి చిత్రాలకు ప్రాణాధారమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. బప్పి తుతుల్ ఈ విషయంలో అభినందనీయుడు. అలాగే ఘోష్ అందించిన కెమెరా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. అలాగే భానోదయ ఎడిటింగ్ కూడా స్లీక్ గా బావుంది. దర్శకుడిగా వంశీ తన మొదటి సినిమాతోనే ఆకట్టుకొన్నాడనే చెప్పాలి. కొన్ని కొన్ని సీన్లను అతను కన్వే చేసిన విధానం చాలా కొత్తగానూ అదే టైమ్ లో మంచిగానూ అనిపిస్తాయి. జీవన్ రెడ్డి అందించిన సంభాషణలు పర్వాలేదు.

ఇక ఈ చిత్రం మొదటి సగం అలా అలా సాగిపోతుంది. అక్కడక్కడా బోరింగ్ సీన్స్ వున్నప్పటికీ కధనం లో బలం వుండడం వల్ల వాటి ప్రభావం సినిమా మీద పెద్దగా పడదు. ఇక సెకెండ్ హాఫ్ లో మాత్రం ప్రేక్షకుడు (ఫూంక్ చూడని వాడు మాత్రమే) థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు చాలానే వున్నాయి. చివరలో చేతబడి, బాణామతి ల వంటివి వున్నాయా లేవా అన్నది ప్రేక్షకుడే చెప్పాలి అన్నట్లు గా చిత్రాన్ని ముగించినప్పటికీ ఆ చేతబడి అన్నది నిజంగానే వుందని వుంది అన్న నమ్మకానికే ఎక్కువ సపోర్ట్ గా వున్నట్లు గా అనిపిస్తుంది. ఇప్పటికీ మరీ మరూ మూల గ్రామాల్లో ఇటువంటి మూఢనమ్మకాల వల్ల మనుషులనకు తగల బెట్టేసిన సందర్భాలున్నాయి. మరి ఈ చిత్రం అటువంటి వారి నంబర్ ని పెంచేదిలానే వుంది తప్పా అవన్నీ మూఢనమ్మకాలే అని స్థిర అభిప్రాయాన్ని కలుగ చేయదు. ఇక దీన్ని ఒక సినిమాలానే ట్రీట్ చేసి చూస్తే ఒక చక్కని సస్పెన్స్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ ని ఇస్తుంది అనడం లో మాత్రం ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి డెఫినెట్ గా ఈ చిత్రం నచ్చుతుంది.

No comments: